అభివృద్ధి పనులు సమర్థవంతంగా చేపట్టాలి
నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను సమర్థవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు.bమంగళవారం మందమర్రి మండలం సారంగపల్లి, ఆదిలపేట, పొన్నారం గ్రామపంచాయతీల పరిధిలో వి.బి.జి. రామ్‌జీ పథకం కింద కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సారంగపల్లిలో నూతనంగా నిర్మించిన మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్, సీసీ వర్క్‌సైట్...