CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 12:40 pm Posted By: coalbelt 24 News

తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి మరో ముందడుగు

నవంబర్ 13న ‘చలో సిద్ధిపేట’..
పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలి
పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు.ఈ నెల నవంబర్ 13వ తేదీన సిద్ధిపేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత భూమిపూజ చేయనున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘చలో సిద్ధిపేట’ పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ప్రజల మధ్యకు వెళ్తోందన్నారు. పార్టీకి సంస్థాగతంగా బలమైన పునాదులు వేసేందుకు జిల్లా స్థాయిలో కార్యాలయాల నిర్మాణం కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం పనిచేసే కేంద్రాలుగా నిలవాలన్నదే పార్టీ అధినేత్రి కవిత ఆశయమని తెలిపారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజకీయ ప్రత్యామ్నాయంగా తెలంగాణ రక్షణ సేనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామగ్రామాన విస్తరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు ఐక్యంగా భారీ సంఖ్యలో సిద్ధిపేటకు తరలివచ్చి భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రక్షణ సేన రాజకీయ ప్రస్థానంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});