తెలంగాణ బీజేపీలో సంస్థాగత ప్రక్షాళనకు కసరత్తు

రాష్ట్ర కమిటీలో మరో ఐదు పదవుల భర్తీకి హైకమాండ్‌ యోచన ఆశావహుల లాబీయింగ్‌ ముమ్మరం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్ఠం చేసేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీలో ఖాళీగా ఉన్న, కొత్తగా ఏర్పాటు చేయనున్న...