CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 5:33 pm Posted By: coalbelt 24 News

మందమర్రిలో సింగరేణి స్థాయి క్రికెట్ పోటీలు

నవంబర్ 11 నుంచి 13 వరకు నిర్వహణ..
ఠాగూర్ స్టేడియం, సింగరేణి హైస్కూల్ మైదానాల్లో పోటీలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గాను కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలను మందమర్రి ఏరియాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో నవంబర్ 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంతో పాటు మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో సింగరేణి సంస్థకు చెందిన అన్ని ఏరియాల క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకోనున్నారు. వివిధ ఏరియాల జట్ల మధ్య జరిగే ఈ పోటీలు క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని పంచనున్నాయి.

సింగరేణి సంస్థ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీజీఎం (పర్సనల్) సురేందర్ తెలిపారు. క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన తన ప్రకటనలో కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});