మందమర్రిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కొరడా!

ప్రభుత్వ రోడ్లు, విద్యుత్ స్తంభాల ఆక్రమణల తొలగింపు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పట్టణంలో ప్రభుత్వ స్థలాలు, ప్రజా రహదారుల ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఈ.ఆర్. క్లబ్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ రోడ్లను, విద్యుత్ స్తంభాల సమీప ప్రాంతాలను ఆక్రమిస్తూ చేపడుతున్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టారు. రోడ్లపైకి చొచ్చుకువచ్చి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నిర్మాణాలను టౌన్ ప్లానింగ్, మున్సిపల్ సిబ్బంది...