CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 2:57 pm Posted By: coalbelt 24 News

మందమర్రిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కొరడా!

ప్రభుత్వ రోడ్లు, విద్యుత్ స్తంభాల ఆక్రమణల తొలగింపు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

పట్టణంలో ప్రభుత్వ స్థలాలు, ప్రజా రహదారుల ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఈ.ఆర్. క్లబ్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ రోడ్లను, విద్యుత్ స్తంభాల సమీప ప్రాంతాలను ఆక్రమిస్తూ చేపడుతున్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రోడ్లపైకి చొచ్చుకువచ్చి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నిర్మాణాలను టౌన్ ప్లానింగ్, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కూల్చివేస్తున్నారు. ప్రజా రహదారులపై ఆక్రమణలను తొలగించి రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని మున్సిపల్ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ స్థలాలు, రహదారులను ఆక్రమించి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పట్టణ ప్రజలు మున్సిపల్ నిబంధనలను పాటిస్తూ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు సహకరించాలని వారు సూచించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});