హెచ్ఐవీ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కోల్ బెల్ట్ న్యూస్(భిక్కనూరు): హెచ్ఐవీ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వైఆర్జి కేర్ ఉమ్మడి జిల్లా రిసోర్స్ పర్సన్ గర్దాసు సుధాకర్ పిలుపునిచ్చారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఆర్జి కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింక్ వర్కర్ స్కీం ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో...