కోల్ బెల్ట్ న్యూస్(భిక్కనూరు):
హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వైఆర్‌జి కేర్ ఉమ్మడి జిల్లా రిసోర్స్ పర్సన్ గర్దాసు సుధాకర్ పిలుపునిచ్చారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఆర్‌జి కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింక్ వర్కర్ స్కీం ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులు, క్షయ (టీబీ) వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధిగ్రస్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నామని వివరించారు.
హైరిస్క్ సముదాయాలను గుర్తించి, వారికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆయా వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన నివారణ జాగ్రత్తలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాధులపై అపోహలు వీడి, ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీ, సుఖవ్యాధులు, టీబీ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు మరియు ఇతర ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హేమామి, లింక్ వర్కర్ సుకన్య, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});