బెల్లంపల్లి బుగ్గ దేవాలయంలో మహిళా భక్తుల దీపోత్సవం

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా బుగ్గ దేవాలయం కోనేటిలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వదిలి, వాయనం ఇచ్చుకున్నారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేటిలో దీపాలు వెలిగించి వదలడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి రాజేశ్వర్, మాజీ ఆలయ చైర్‌పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, మాజీ సర్పంచ్ జిల్లాపల్లి స్వరూప వెంకటస్వామి,...