కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా బుగ్గ దేవాలయం కోనేటిలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వదిలి, వాయనం ఇచ్చుకున్నారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేటిలో దీపాలు వెలిగించి వదలడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి రాజేశ్వర్, మాజీ ఆలయ చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, మాజీ సర్పంచ్ జిల్లాపల్లి స్వరూప వెంకటస్వామి, ఆలయ ఈఓ వేణుగోపాల్, అర్చకులు సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉందని, భక్తులు సంప్రదాయాలను పాటిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});