ప్రజావాణి దరఖాస్తులకూ కానరాని పరిస్కారం
28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలి ఎంపీడీవోకు ఎంసీపీఐ(యు) వినతి కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో కేవలం కాగితాలకే పరిమితమవుతోందని ఎంసీపీఐ(యు) పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఎంసీపీఐ(యు) పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో...