CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 7:45 pm Posted By: coalbelt 24 News

మందమర్రిలో రోడ్డు ప్రమాదం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అందుగులుపేట గ్రామం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం వచ్చిన ఓ బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఈ .విధంగా ఉన్నాయి. …మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ చౌహాన్ తన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ (నంబర్ MP 28 ZE 3391)లో టమోటాల లోడ్‌తో ప్రయాణిస్తుండగా మందమర్రి సమీపంలో వ్యాన్ వెనుక ఎడమవైపు టైరు ఊడిపోయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టార్చ్‌లైట్ సహాయంతో టైర్‌ను పరిశీలిస్తున్న సమయంలో బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న బస్సు (నంబర్ MP 41 P 7770) వేగంగా వచ్చి పికప్ వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పికప్ వ్యాన్ వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. వ్యాన్‌లో ఉన్న టమోటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో బాధితుడికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ అమిత్ చౌహాన్ వ్యాన్ పక్కన ఉండటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.బస్సు డ్రైవర్ పఠాన్ గఫూర్ ఖాన్ (మహారాష్ట్ర) నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});