బెల్లంపల్లి బస్టాండ్‌లోకి బస్సులేవీ?

మూడు నెలలుగా నిలిచిన బస్సుల రాకపోకలు.. ప్రయాణికులు, విద్యార్థులకు తప్పని అవస్థలు అధికారుల నిర్లక్ష్యంపై ఎంసీపీఐయూ నాయకుల అసంతృప్తి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): పట్టణంలోని కొత్త బస్టాండ్‌లోకి గత మూడు నెలలుగా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో ఏర్పడిన గుంత కారణంగా బస్సుల రాకపోకలను నిలిపివేసినప్పటికీ, ఇంతవరకు సమస్యను పరిష్కరించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఎంసీపీఐయూ పార్టీ నాయకులు...