CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 9:53 am Posted By: coalbelt 24 News

హుజూరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేనకు పెరుగుతున్న ఆదరణ

పార్టీలో చేరిన 20 మందికి పైగా మైనారిటీ నాయకులు
అనుచరులతో కలిసి చేరిన రెడ్డబోయిన సురేష్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణ రక్షణ సేన పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆదరణ పెరుగుతోంది. బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సమక్షంలో పలువురు నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈ చేరికల కార్యక్రమం జరిగింది. హుజూరాబాద్ మండలం పెద్దపాయిపల్లికి చెందిన మైనారిటీ నాయకుడు ఎం.డి. సల్మాన్ ఖాన్‌తో పాటు మరో 20 మంది మైనారిటీ నాయకులు కవిత చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అదేవిధంగా రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన సురేష్ తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో చేరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, కవిత నాయకత్వంపై విశ్వాసంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తుందని పేర్కొన్నారు. ఈ చేరికలు నియోజకవర్గంలో పార్టీ విస్తరణకు దోహదపడటమే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల నాయకులు పార్టీలో చేరడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనకు రాజకీయంగా మరింత బలం చేకూరిందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});