మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ప్రజలకు తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం ఇప్పటివరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోయినప్పటికీ, ప్రజలతో తమకున్న అనుబంధం, గౌరవం ఎప్పటికీ కొనసాగుతాయని పేర్కొన్నారు. తనను ఆదరిస్తూ, అభిమానిస్తూ వస్తున్న ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
బీబీపేట మండలంలోని ఈయాడారం, తుజాల్పూర్, ఇస్సానగర్, ఉప్పు జనగామ, కోనాపూర్, రామ్‌రెడ్డిపల్లి, శివరామరెడ్డిపల్లి, షేర్, బీబీపేటతో పాటు అన్ని గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.మండల ప్రజలందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని, ప్రతి ఇంటా దీపావళి వెలుగులు నింపాలని కొరివి నీరజ నర్సింలు, కొరివి నర్సింలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});