CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 4:21 pm Posted By: coalbelt 24 News

బీబీపేటలో రేపు వైభవంగా బండ్ల బోనాల పండుగ

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద రేపు నిర్వహించనున్న బండ్ల బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీబీపేట ముదిరాజ్ సోదరుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ పండుగకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.పెద్దమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడిపంటలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే కులమత భేదాలు లేకుండా ప్రతి సంవత్సరం ఎంతోమంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ పండుగ బీబీపేట ప్రాంతంలో ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్దమ్మ తల్లి కృపతో తమ జీవితాల్లో శుభాలు కలిగాయని పలువురు భక్తులు విశ్వసిస్తూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రేపు జరిగే బండ్ల బోనాల పండుగకు భక్తులంతా కుటుంబ సమేతంగా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని, ఉత్సవాల్లో పాల్గొని పండుగను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});