చిన్న వయసులో తెల్ల జుట్టు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యను నివారించేందుకు సమతుల్య పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రొటీన్లు, ఐరన్, విటమిన్ B12, బయోటిన్, జింక్ వంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అయినప్పటికీ సమస్య కొనసాగితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.