కేకే ఓసీలో నష్టపరిహారం అక్రమాలపై విచారణ జరిపించాలి

నకిలీ పట్టాలతో పరిహారం పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి అసలైన భూ బాధితులకు న్యాయం చేయాలి కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ (KK OC) పరిధిలో భూ నష్టపరిహారం పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది వ్యక్తులు నష్టపరిహారం పొందేందుకు కాటపేట శివారు పరిధిలోని సర్వే నంబర్లు 146, 147లో ఇతర ప్రాంతాలకు చెందిన భూముల పట్టాలతో పాటు నకిలీ పట్టాలను వినియోగించి, తమ భూములు ఓపెన్‌కాస్ట్ తవ్వకాలలో కోల్పోయినట్లు అధికారులను తప్పుదోవ పట్టించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా భారీ...