భూభారతి రీ-సర్వేపై గ్రామస్థులకు అవగాహన
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): మండలంలోని సేరి బీబీపేట, రామచంద్రాపూర్ గ్రామాల్లో భూభారతి రీ-సర్వేపై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా భూముల కొలతల అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రీ-సర్వే ప్రక్రియ, దాని ప్రాధాన్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రతి భూమిని సమగ్రంగా కొలవడం జరుగుతుందని, భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామాల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి...