బియ్యం ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ నిర్ణీత ధరలకే విక్రయాలు జరపాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోల్ బెల్ట్ న్యూస్(జైపూర్); ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సమత రైస్ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి....