మంచిర్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. నిత్యావసర ధరలను నియంత్రించాలి నవంబర్ 10న కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, నీటి ఎద్దడి కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నవంబర్ 10న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న చలో కలెక్టరేట్ ధర్నాకు సంబంధించిన కరపత్రాలను గురువారం...