విద్యార్థుల విద్యాభివృద్ధికి సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కృషి అభినందనీయం
ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఉర్దూ మీడియం విద్యార్థులకు నాణ్యమైన విద్యా సహాయాన్ని అందించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో AIMIM పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మంచిర్యాల పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. గురువారం పదో తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన AIMIM ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కోసం సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
ఉర్దూ మీడియం విద్యార్థులకు నాణ్యమైన విద్యా సహకారం అందించడం, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విద్యావకాశాలు కల్పించడం లక్ష్యంగా ట్రస్ట్ ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});