తెలంగాణ రక్షణ సేనలో నూతన బాధ్యతల స్వీకరణ
కొత్తగా నియమితులైన నాయకులకు ఘన సన్మానం కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేన పార్టీలో నూతనంగా వివిధ పదవుల బాధ్యతలు చేపట్టిన నాయకులకు బుధవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన నాయకులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తెలంగాణ రక్షణ సేన బీసీ సెల్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన ఉస్తెం శ్రీనివాస్ ముదిరాజ్‌ను ప్రత్యేకంగా సన్మానించి...