CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 4:45 pm Posted By: coalbelt 24 News

తెలంగాణ రక్షణ సేనలో నూతన బాధ్యతల స్వీకరణ

కొత్తగా నియమితులైన నాయకులకు ఘన సన్మానం
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రక్షణ సేన పార్టీలో నూతనంగా వివిధ పదవుల బాధ్యతలు చేపట్టిన నాయకులకు బుధవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన నాయకులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తెలంగాణ రక్షణ సేన బీసీ సెల్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన ఉస్తెం శ్రీనివాస్ ముదిరాజ్‌ను ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మండల కమిటీల్లో వివిధ పదవులు పొందిన నాయకులను ఘనంగా సత్కరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అనంతరం సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆశయాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రక్షణ సేన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేన స్వప్న, మేకల శ్రీనివాస్ యాదవ్, ఎంచెర్ల స్వామి, బొంగోని శంకర్ గౌడ్, మొలుగూరి స్వప్న, దాసరి అంజలితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});