సీఎం రేవంత్ రెడ్డితో టీజేఏస్ ప్రతినిధుల సమావేశం
నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు పెండింగ్ ఫీజుల విడుదలకు విజ్ఞప్తి కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ జన సమితి (టీజేఏస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజేఏస్ పార్టీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేయాలని, విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు...