తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులు అప్రజాస్వామికం
ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం సీఎం ఇంటి ముట్టడికి యత్నం బెల్లంపల్లిలో ఏడుగురు ముందస్తు అరెస్టు కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించకుండా, వారి హక్కుల కోసం గళమెత్తుతున్న వారిని అరెస్టు చేయడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు....