CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 8:29 pm Posted By: coalbelt 24 News

మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతు

ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన 10 మంది పోలీసు కానిస్టేబుళ్లు గల్లంతయ్యారు.చెరువులో మత్స్యకారులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు 10 మంది కానిస్టేబుళ్లు రెండు బోట్లలో చెరువులోకి వెళ్లారు. అయితే, అనూహ్యంగా రెండు బోట్లు చెరువులో బోల్తా పడటంతో అందులో ఉన్న10 మంది కానిస్టేబుళ్లు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా మత్స్యకారుల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లిన పోలీసులే ప్రమాదంలో చిక్కుకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});