అధిక సాంద్రత పత్తి సాగుతో ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి
అందుగులపేటలో పత్తి చేను పరిశీలించిన అధికారులు కాటన్ డెవలప్మెంట్ డైరెక్టరేట్ సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రియాంక్ గైక్వాడ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కేంద్ర ప్రభుత్వ కపాస్ క్రాంతి పథకం – మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అధిక సాంద్రత పత్తి సాగు అమలు తీరును నాగ్‌పూర్‌లోని కాటన్ డెవలప్మెంట్ డైరెక్టరేట్ సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రియాంక్ గైక్వాడ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన రైతు ఏనుగు ఆశిరెడ్డి సాగు చేసిన...