రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీల విజేతలకు ఘన సన్మానం

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): యాదగిరిగుట్టలో అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన కామారెడ్డి సర్కిల్‌కు చెందిన కళాకారులను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో బీబీపేట మండలానికి చెందిన రాష్ట్రస్థాయి కళాకారులతో పాటు కామారెడ్డి సర్కిల్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురు కళాకారులు, మహిళా కళాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3న కామారెడ్డి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్...