CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:56 pm Posted By: coalbelt 24 News

డిస్మిస్ కార్మికులకు దరఖాస్తు గడువు నవంబర్ 14

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహించి పలు వ్యక్తిగత కారణాల వల్ల డిస్మిస్ అయిన కార్మికులకు యాజమాన్యం మరొక అవకాశం కల్పించే విధంగా కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఒప్పందం చేయడం జరిగిందని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మంగళవారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధికి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా సుమారు 600 మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు. వీరందరూ ఈనెల 14 తేదీలోగా సంబంధిత ఏరియాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

డిస్మిస్ కార్మికులందరికీ HPC నిబంధనలు వర్తిస్తాయన్నారు. డిస్మిస్ కావడానికి ముందు ఐదేళ్ల కాలంలో రెండేళ్లలో వరుసగా వంద మాస్టర్లు పూర్తి చేయాలన్నారు. అదే విదంగా 48 ఏళ్ల వయసు లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం తప్పనిసరిగా ఉంటుందన్నారు. 2023 నుంచి 2025 సంవత్సరం లోపు డిస్మిస్ అయిన కార్మికులు మాత్రమే ఈ నెల నాలుగో తేదీ నుంచి ఇదే నెల 14 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. సింగరేణి గనుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా ఉద్యోగ అవకాశం ఉంటుంది. గతంలో విధులు నిర్వహించిన ఏరియాలో అవకాశం ఇవ్వాలనే నిబంధన లేదని ఈ సందర్బంగ సీతారామయ్య వివరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});