మందమరి ఏరియాలో విజిలెన్స్ వారోత్సవాలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి); సింగరేణి సంస్థ మందమరి ఏరియా పరిధిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. సి.ఈ.ఆర్. క్లబ్ మందమరిలో, ఆర్.కే.సి.ఓ.ఏ. క్లబ్ రామకృష్ణాపూర్లో, ఇల్లందు క్లబ్ మందమరిలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమాలకు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ సి.ఎన్. రాధాకృష్ణ, ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణతో పాటు ఏరియా ఉన్నతాధికారులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది ‘నిజాయితీతో సమృద్ధి’ అనే ప్రధాన నినాదంతో అక్టోబర్ 26...