CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 5:19 pm Posted By: coalbelt 24 News

జాతీయ ఐక్యతకు ప్రతిరూపమే ఐక్యతా దినోత్సవం

దేశ సమగ్రత, సమైక్యత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

దేశంలోని ప్రజలందరి ఏకత్వానికి ప్రతిరూపమే జాతీయ ఐక్యతా దినోత్సవమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత, సమైక్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జాతీయ ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తూ దేశ సమగ్రతను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});