బియ్యం ధరల పట్టికలు తప్పనిసరిగా ప్రదర్శించాలి
నిర్ణీత ధరలకు మించి విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ హెచ్చరిక కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): బియ్యం విక్రయదారులు తమ దుకాణాల్లో వివిధ రకాల బియ్యం గరిష్ట విక్రయ ధరల వివరాలను ప్రజలకు కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ ఆదేశించారు. నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల శ్రీనాథ్ ట్రేడర్స్, హరి ఓం ట్రేడర్స్, మహేశ్వరి ట్రేడర్స్ బియ్యం...