CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 10:54 pm Posted By: coalbelt 24 News

బియ్యం ధరల పట్టికలు తప్పనిసరిగా ప్రదర్శించాలి

నిర్ణీత ధరలకు మించి విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ హెచ్చరిక
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

బియ్యం విక్రయదారులు తమ దుకాణాల్లో వివిధ రకాల బియ్యం గరిష్ట విక్రయ ధరల వివరాలను ప్రజలకు కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ ఆదేశించారు. నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల శ్రీనాథ్ ట్రేడర్స్, హరి ఓం ట్రేడర్స్, మహేశ్వరి ట్రేడర్స్ బియ్యం విక్రయ దుకాణాలను డీటీ, ఆర్‌ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి బియ్యం విక్రయ కేంద్రంలో వివిధ రకాల బియ్యం గరిష్ట ధరలను తెలిపే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం బీపీటీ బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా / హెచ్‌ఎంటీ బియ్యం కిలో రూ.74, జైశ్రీరామ్ బియ్యం కిలో రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు.

హోల్‌సేల్ వ్యాపారులు, కిరాణా వర్తకులు, మిల్లర్లు, బియ్యం విక్రయదారులందరూ నిర్ణీత ధరలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వినియోగదారులకు ధరలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు దుకాణాల్లో ధరల పట్టికలు, ఫ్లెక్సీలను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలను ఉల్లంఘించి అధిక ధరలకు బియ్యం విక్రయించే వారిపై నిత్యావసర వస్తువుల చట్టం–1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ హెచ్చరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});