నవంబర్ 2, 3 తేదీల్లో మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ప్రత్యేక శిబిరం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మందమర్రి ఏరియా పరిధిలోని మాజీ సింగరేణి ఉద్యోగుల కోసం సీఎంపీఎఫ్ ఆఫీస్ (CMPFO), గోదావరిఖని అధికారుల ఆధ్వర్యంలో జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) పునరుద్ధరణపై ప్రత్యేక అవగాహన, రెన్యూవల్ క్యాంపును నిర్వహించనున్నట్లు మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) ఇన్‌చార్జ్ సందీప్ తెలిపారు.
ఈ నెల నవంబర్ 2, 3 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్యాంపులో జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా పునరుద్ధరించుకోవాలనే విషయంపై సీఎంపీఎఫ్ అధికారులు ప్రత్యక్షంగా అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన సూచనలు అందజేయనున్నారు. కావున మందమర్రి ఏరియా పరిధిలోని మాజీ సింగరేణి ఉద్యోగులు, పింఛనుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
క్యాంపునకు వచ్చేవారు తీసుకురావాల్సిన పత్రాలు:…పీపీఓ (PPO) కాపీ, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్.మాజీ సింగరేణి ఉద్యోగులందరూ అవసరమైన పత్రాలతో క్యాంపునకు హాజరై డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పునరుద్ధరణ సేవలను వినియోగించుకోవాలని డీజీఎం (పర్సనల్) ఇన్‌చార్జ్ సందీప్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});