CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 5:11 pm Posted By: coalbelt 24 News

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూ.129.25 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});