జాతీయ స్థాయి యోగా టోర్నమెంట్ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఇండియన్ యోగ స్కూల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ స్థాయి యోగా ఇన్విటేషన్ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆవిష్కరించారు. యోగా గురువులతో కలిసి ఆయన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నిర్వహించనున్న యోగా టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. యోగా ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, యువతలో యోగా పట్ల...