విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ఆధ్వర్యంలో మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి. సంధాని, ఆర్. శ్రీనివాస్, సబ్బాని సదయ్య, ఆర్. రాములు హాజరయ్యారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, కార్మిక చట్టాలు, మోటారు వాహనాల చట్టం తదితర అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకొని చట్టాలను గౌరవించాలని వక్తలు సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా అన్యాయాలను ఎదుర్కొనే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});