రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మందమర్రి విద్యార్థిని అనూ ఎంపిక
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల, మందమర్రిలో పదవ తరగతి చదువుతున్న జీ. అనూ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైంది. 2026 అక్టోబర్ 26న నిర్వహించిన జోనల్ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో అనూ తన ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. మెదక్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్, పీటీ ఉపాధ్యాయురాలు ఎం. చిన్నక్క అనూను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను...