సహజ వ్యవసాయంతో నేల ఆరోగ్యాన్ని కాపాడాలి
యాసంగిలో వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలి మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సాగు భూముల సంరక్షణకు రైతులు సహజ వ్యవసాయాన్ని అవలంబించాలని మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి సూచించారు. బుధవారం అందుగులపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఖేత్ బచావో అభియాన్ – సాగు భూమి సంరక్షణ” కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ యాసంగి సీజన్లో అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా...