కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలి
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో రజకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. బుధవారం మందమర్రిలోని సీఐటీయూ బ్రాంచ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం 26వ ఆవిర్భావ వార్షికోత్సవంలో ఆశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను...