CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 10:11 pm Posted By: coalbelt 24 News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు టీఆర్‌ఎస్ నాయకుల మద్దతు

సమాన పనికి సమాన వేతనం,
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి –
పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేణి సప్న ముదిరాజ్‌

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వప్న ముదిరాజ్‌ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాంటి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఎన్నికల సమయంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించడంతో పాటు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం సమ్మె బాట పట్టడం వారి సమస్యల తీవ్రతను తెలియజేస్తోందని పేర్కొంటూ, ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని సూచించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో తక్షణమే చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేందర్ కొమురయ్య యాదవ్, సీనియర్ నాయకులు బోగని శంకర్ గౌడ్, ఉస్తేం శ్రీనివాస్ ముదిరాజ్, మహిళా నాయకురాలు అంజలి తదితరులు పాల్గొన్నారు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});