CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 10:30 pm Posted By: coalbelt 24 News

ఓబీసీల డిమాండ్ల సాధనకు హైదరాబాద్‌లో సమావేశం

దేశవ్యాప్తంగా బీసీ నేతల హాజరు
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

దేశవ్యాప్తంగా ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్ మంగళవారం తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుందని వారు వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఓబీసీలకు సంబంధించిన న్యాయబద్ధమైన హక్కులు, డిమాండ్ల సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. బీసీ వర్గాల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడం, వారి హక్కుల సాధన కోసం నాయకుల మధ్య సమన్వయం పెంపొందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఈ సమావేశానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కూడా హాజరుకానున్నట్లు సలేంద్ర కొమురయ్య యాదవ్, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీ నాయకులు ఒకే వేదికపైకి రావడం ద్వారా ఓబీసీల డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చకు అవకాశం ఏర్పడనుందని పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});