ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి
TRS పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేన స్వప్న ముదిరాజ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్టోబర్ 30న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేన స్వప్న ముదిరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లిలో సభకు సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వప్న ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు తెలంగాణ ప్రజలు, యువత, మహిళలు, నాయకులు,...