మందమర్రి ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి) సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఇన్‌చార్జి జీఎం జి.ఎల్. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది ‘నిజాయితీతో సమృద్ధి’ అనే ప్రధాన నినాదంతో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఏరియాలోని అన్ని గనులు, విభాగాలు, కార్యాలయాల్లో వారోత్సవాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జి.ఎల్. ప్రసాద్ మాట్లాడుతూ, స్వతంత్ర భారత...