CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 5:26 pm Posted By: coalbelt 24 News

మందమర్రి ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి)

సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఇన్‌చార్జి జీఎం జి.ఎల్. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది ‘నిజాయితీతో సమృద్ధి’ అనే ప్రధాన నినాదంతో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఏరియాలోని అన్ని గనులు, విభాగాలు, కార్యాలయాల్లో వారోత్సవాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా జి.ఎల్. ప్రసాద్ మాట్లాడుతూ, స్వతంత్ర భారత తొలి హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఏ సంస్థలోనైనా లక్ష్యాలు ఎంత ఉన్నతంగా ఉన్నా, ప్రణాళికలు ఎంత పకడ్బందీగా రూపొందించినా వాటి అమలులో అవినీతి, అక్రమాలు, అవకతవకలు, అధికార దుర్వినియోగం చోటుచేసుకుంటే ఆశించిన ఫలితాలు సాధించలేమని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ నిజాయితీని జీవన విధానంగా అలవర్చుకుని, సంస్థ అభ్యున్నతికి అంకితభావంతో పనిచేయాలని కోరారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి పౌరుల సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, సీఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, కమ్యూనికేషన్ సెల్ అండ్ సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్, సీనియర్ పీఓ సత్యనారాయణ, జీఎం కార్యాలయ ఫిట్ సెక్రటరీ గీతికతో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});