CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 8:09 pm Posted By: coalbelt 24 News

విద్యార్థులు చట్టంపై గౌరవం, క్రమశిక్షణ అలవర్చుకోవాలి

పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
విద్యార్థులకు పోలీస్ విధి విధానాలపై అవగాహన
మందమర్రి ఎస్‌ఐ నరేష్ పిలుపు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టం పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత, క్రమశిక్షణను అలవర్చుకోవాలని మందమర్రి ఎస్‌ఐ నరేష్ పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మందమర్రి పోలీస్ స్టేషన్‌లో స్థానిక పాఠశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రిసెప్షన్ డెస్క్, మహిళా హెల్ప్ డెస్క్, కేసుల నమోదు విధానం, లాకప్ గదుల గురించి వివరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేపట్టే చర్యలు, ప్రజల రక్షణలో పోలీసుల పాత్రను వివరించారు. మహిళలు, బాలబాలికల భద్రత కోసం ఏర్పాటు చేసిన మహిళా సహాయ కేంద్రం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఉపయోగించే వివిధ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు, ఆయుధాల గురించి వివరించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకోవాలని ఎస్‌ఐ నరేష్ సూచించారు. విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి, చట్టాలను గౌరవిస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని కోరారు.ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోలీసుల పట్ల ఉన్న భయాలు తొలగి, పోలీస్ వ్యవస్థపై అవగాహన, గౌరవం పెరుగుతాయని ఎస్‌ఐ నరేష్ తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});