మంచిర్యాల పట్టణంలో కోతుల బెడద
ప్రజల దైనందిన జీవనానికి అంతరాయం సంబంధింత అధికారులు స్పందించాలి కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల పట్టణంలో వీధుల్లో సంచరిస్తున్న కోతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాస కాలనీలు, ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కోతుల సంచారం ప్రజల భద్రతకు ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రోడ్లపై సురక్షితంగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలి రోజుల్లో కోతుల దాడులు, కాటు ఘటనలు పెరుగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు...