మంచిర్యాల జిల్లా నుంచి వెయ్యి బైకులతో ర్యాలీగా వెళ్లేందుకు సన్నాహాలు
మాజీ మంత్రి బోడ జనార్దన్ పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ నెల 30న ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్ పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ మేరకు బోడ జనార్దన్ కార్యాలయంలో పాంచజన్య సంకల్ప సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం, వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించే అంశాలపై చర్చించారు. మంచిర్యాల జిల్లా నుంచి సుమారు వెయ్యి బైకులతో నాయకులు, కార్యకర్తలు సభకు తరలిరావాలని బోడ జనార్దన్ కోరారు. బైక్ ర్యాలీ ద్వారా సభకు హాజరయ్యే వారి భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని సూచించారు.
రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సభ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. సభకు అధిక సంఖ్యలో హాజరయ్యేలా స్థానిక నాయకత్వం బాధ్యత తీసుకోవాలని, మహిళా నాయకురాళ్లు, యువజన విభాగాలు, కార్మిక సంఘాల నాయకులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతం కావడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త తన వంతు కృషి చేయాలని బోడ జనార్దన్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు డా. ఉదారి చంద్రమోహన్ గౌడ్, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి తిప్పర్తి సారన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా యువజన అధ్యక్షుడు ఐత ప్రశాంత్, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పొలసాని హారిక రావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, కొరకొప్పుల మహేష్ గౌడ్, వేముల సాయి కుమార్ గౌడ్, సందీప్ గౌడ్, సంపత్, అనిల్, సంపత్ కుమార్, జహీర్ ఖాన్, శ్రీవాణి, రజిత, హెచ్‌ఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});