పదవీ విరమణ చేసినా.. మానవత్వానికి విరామం లేదు…

కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్న మందమర్రి సింగరేణి రిటైర్డ్ కార్మికుల అసోసియేషన్ ఐకమత్యానికి, ఆప్యాయతకు నిలువెత్తు నిదర్శనం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): బొగ్గు గనుల్లో ఎన్నో ఏళ్లపాటు శ్రమించి నల్ల బంగారాన్ని వెలికితీసి సింగరేణి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులు పదవీ విరమణ అనంతరం కూడా తమ ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలికినా, తోటి కార్మికులతో ఏర్పడిన అనుబంధానికి మాత్రం విరామం ఇవ్వడం లేదు. ఒకప్పుడు గనుల్లో కలిసి పనిచేసిన వారు.. నేడు ఒకరికొకరు అండగా నిలుస్తూ కష్టసుఖాలను పంచుకుంటున్నారు....